తెలంగాణ

telangana

ETV Bharat / state

JAGADISH REDDY: 'రైతన్న' సినిమా తీయడం అభినందనీయం - తెలంగాణ వార్తలు

సినీనటుడు ఆర్.నారాయణ మూర్తి నటించిన 'రైతన్న'(RAITHANNA MOVIE) చిత్రాన్ని మంత్రి జగదీశ్వర్ రెడ్డి(JAGADISH REDDY) వీక్షించారు. సూర్యాపేటలోని ఈశ్వర్ మూవీ మాక్స్ థియేటర్‌లో రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి చూశారు. సాగు చట్టాలు(FARM LAWS), వాటి పరిణామాలపై ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయమని అన్నారు.

JAGADISH REDDY, raithanna movie
రైతన్న సినిమా వీక్షించిన మంత్రి జగదీశ్ రెడ్డి, ఆర్ నారాయణ మూర్తి రైతన్న సినిమా

By

Published : Aug 18, 2021, 4:25 PM IST

సినీనటుడు ఆర్.నారాయణ మూర్తి(R NARAYANA MURTHY) నటించిన రైతన్న(RAITHANNA) చిత్రాన్ని సూర్యాపేటలోని ఈశ్వర్ మూవీ మాక్స్ థియేటర్‌లో రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి(JAGADISH REDDY) వీక్షించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలపై(FARM LAWS) ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినందుకు ఆయనకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తనదైన శైలిలో సినిమాలను చిత్రీకరించి ప్రజలను, రైతులను చైతన్య పరిచే నారాయణ మూర్తి... ఈసారి సాగు చట్టాల కథాంశంతో సినిమా తీయడం అభినందనీయమని మంత్రి అన్నారు. సాగు చట్టాల వల్ల కలిగే లాభ నష్టాలు, వాటి వల్ల కలిగే పరిణామాలను రైతన్న సినిమా ద్వారా ప్రజలకు తెలిసే విధంగా చిత్రీకరించారని పేర్కొన్నారు.

సినిమా రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి తన సినిమాల ద్వారా పేద ప్రజలు, రైతులను మేల్కొలిపే ప్రయత్నం చేసే వ్యక్తి ఆర్.నారాయణ మూర్తి. ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చే సినిమాలు చేసే ఆయన... ఈమధ్య కాలంలో వచ్చిన కొత్త సాగు రైతు చట్టాల మీద అవగాహన కల్పించడానికి సినిమా చేశానని... దానిని వీక్షించాలని కోరారు. ఈ సినిమాతో కొత్త రైతు చట్టాలతో వచ్చే లాభనష్టాలను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే ఈ సినిమాను సూర్యాపేటలో చూశా. విషయాన్ని చాలా గంభీరంగా చెప్పే అలవాటు ఉన్న ఆయన... తనదైన పద్ధతిలో రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తున్నాను.

-జగదీశ్ రెడ్డి, మంత్రి

ఇదీ చదవండి:GANDHI HOSPITAL: 'గాంధీలో అత్యాచారం జరిగే అవకాశం లేదు.. బురద జల్లే ప్రయత్నం చేయొద్దు'

ABOUT THE AUTHOR

...view details