దుబ్బాక ప్రజలు భాజపా, కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి వద్ద... తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. హుజూర్నగర్ ఫలితమే దుబ్బాకలోనూ పునరావృతం కానుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపా, కాంగ్రెస్ డిపాజిట్ల కోసం పోటీ పడుతున్నాయని దుయ్యబట్టారు.
దుబ్బాకలోనూ హుజూర్నగర్ ఫలితమే: జగదీశ్ రెడ్డి - మఠంపల్లిలో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటన
సూర్యాపేట జిల్లా మఠంపల్లి వద్ద కృష్ణానదిపై బ్రిడ్జిని మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. దుబ్బాకలోనూ హుజూర్నగర్ ఫలితమే పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, భాజపా డిపాజిట్ల కోసం పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు.
దుబ్బాకలోనూ హుజూర్నగర్ ఫలితమే: జగదీశ్ రెడ్డి