తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ రైతులపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహారిస్తోంది: మంత్రి జగదీశ్​ రెడ్డి - నల్గొండ తాజా వార్తలు

తెలంగాణ రైతులపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహారిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు అన్నదాతలకు నష్టం చేసే విధంగా ఉన్నాయన్నారు. ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో పండిన ప్రతి గింజను కేంద్రంమే కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.

MINISTER JAGADISH REDDY
మంత్రి జగదీష్ రెడ్డి

By

Published : Apr 4, 2022, 10:50 PM IST

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో తెరాస నేతలు రోడ్డెక్కారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సూర్యాపేటలో తెరాస ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి జగదీశ్​ రెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేసేదాక కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేది లేదని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్ ముందే రైతులకు సూచించారని తెలిపారు.

రాష్ట్ర భాజపా నేతలే రైతులను రెచ్చగొట్టారన్న మంత్రి .. ధాన్యాన్ని కొనిపిస్తామని అన్నారని మంత్రి గుర్తు చేశారు. ధాన్యాన్ని కొనిపిస్తామన్న భాజపా నేతలు ఇవాళ కనిపించట్లేదని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్​లను నియంత్రించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రాలలో పండిన పంటలను ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు తరలించే హక్కు కేంద్రానికి ఉందని చెప్పారు. కేంద్రంలో ఒకలా రాష్ట్రంలో ఒకలా భాజపా ప్రవర్తిస్తోందని మంత్రి జగదీశ్​ రెడ్డి మండిపడ్డారు.

మంత్రి జగదీష్ రెడ్డి

ఇదీ చదవండి: 'రైతులను రెచ్చగొట్టి.. పత్తా లేకుండా పోయారు'

ABOUT THE AUTHOR

...view details