సూర్యాపేట జిల్లా కోదాడలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వ్యవసాయ కమీటీ ఛైర్‌పర్సన్‌గా బుర్ర సుధారాణి నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. మార్కెట్ కమిటీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేశారు.
'బడ్జెట్లో 65 శాతం వ్యవసాయనికే కేటాయిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్' - minister jagadeesh reddy visited in kodhada
సూర్యాపేట జిల్లా కోదాడలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. మొత్తం బడ్జెట్లో 65 శాతం వ్యవసాయనికే కేటాయిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి వివరించారు.
!['బడ్జెట్లో 65 శాతం వ్యవసాయనికే కేటాయిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్' 'బడ్జెట్లో 65 శాతం వ్యవసాయనికే కేటాయిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9370217-666-9370217-1604064899253.jpg)
'బడ్జెట్లో 65 శాతం వ్యవసాయనికే కేటాయిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్'
వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందని మంత్రి పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్లో 65 శాతం వ్యవసాయనికే కేటాయిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని వివరించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి మార్కెట్ వరకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెరాస కార్యకర్తలతో ఎడ్లబండితో ర్యాలీ నిర్వహించారు.