సూర్యాపేటలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు మున్సిపాలిటీ రూపొందించిన యాప్ ద్వారా నిత్యావసర సరకులు, కూరగాయలు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.
రెడ్‌జోన్ ప్రాంతాల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటన - సూర్యాపేటలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో జగదీశ్ రెడ్డి పర్యటన
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి పట్టణంలోని రెడ్‌జోన్ ప్రాంతాలను పరిశీలించారు.
రెడ్‌జోన్ ప్రాంతాల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటన
జిల్లా కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్‌తో కలిసి రెడ్‌జోన్ ప్రాంతాలను పరిశీలించారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా అదుపులోకి వస్తుందని... అందుకు అందరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.