తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడి కోసం సీఎం నిరంతరం సమీక్షిస్తున్నారు: మంత్రి జగదీశ్ - తెలంగాణ వార్తలు

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. కరోనా సోకిన వారు విధిగా ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు. హుజూర్​నగర్ నియోజకవర్గంలో కొవిడ్ పరిస్థితులపై ఆయన సమీక్షించారు.

minister jagadeeswar reddy review
మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమీక్ష, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

By

Published : May 18, 2021, 11:02 AM IST

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ అధ్యక్షతన టాస్క్​ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కరోనా అనుమానితులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలు, 184 గ్రామ పంచాయతీల్లో 85,531 ఇళ్లలో సర్వే నిర్వహించగా... 3,289 మందికి పాజిటివ్​గా తేలిందని తెలిపారు. వారిలో 2,486 మందికి మెడికల్ కిట్లు అందజేశామన్నారు. కొవిడ్ పరిస్థితులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో మంత్రి పాల్గొన్నారు.

కరోనా సోకిన వారు విధిగా ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు. హుజూర్​నగర్, కోదాడలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలతో పాటు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 200 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవచ్చునని ఆయన తెలిపారు. బాధితులకు ఉచిత భోజన సౌకర్య కల్పించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్​వో కోట చలం, డిప్యూటీ డీఎంహెచ్​వో హర్షవర్ధన్, డీసీహెచ్ వెంకటేశ్వర్లు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కరుణ్ కుమార్​తో పాటు జడ్పీటీసీ సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, స్థానిక ఆర్డీవో వెంకారెడ్డి, ఎంఆర్వో జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దు: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details