తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ప్రభావం: జిల్లా అధికారులతో మంత్రి జగదీశ్​రెడ్డి సమీక్ష - minister jagadeesh reddy latest news

సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు వారితో సంబంధాలు కలిగిన వ్యక్తులపై దృష్టి సారించారు. తాజా పరిస్థితిపై మంత్రి జగదీశ్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. వైరస్​ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

minister jagadeesh reddy
మంత్రి జగదీశ్​రెడ్డి

By

Published : Apr 8, 2020, 10:59 AM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోటలో 44 మందిని క్వారంటైన్​కు తరలించారు. సమీప గ్రామాల్లోని కొంతమందిని క్వారంటైన్​ చేయనున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి పాజిటివ్ వచ్చినందున వారితో సంబంధాలు కలిగిన వ్యక్తులపై అధికారులు దృష్టి సారించారు. మంత్రి జగదీశ్ రెడ్డి గ్రామంలో పర్యటించారు. తాజా పరిస్థితిపై జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 8 పాజిటివ్​ కేసులు నమోదైనందున.. మిగతా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వర్ధమానుకోటను రెడ్ జోన్​గా ప్రకటించి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అగ్నిమాపక యంత్రాలతో ఆయా ప్రాంతాల్లో స్ప్రే చేశారు. నాగారం మండల కేంద్రంలో 44 మంది, పక్క మండలాలైన అడ్డగూడూరులో 111 మంది, మోత్కూరులో 19, తిరుమలగిరిలో ఇద్దరికి హోం క్వారంటైన్ విధించారు.

మొత్తంగా సూర్యాపేట జిల్లాలో 117 మంది నమూనాల్ని పరీక్షలకు పంపారు. 69 మంది నివేదికలు రావాల్సి ఉంది. ప్రభుత్వ క్వారంటైన్లలో 116 మంది... హోం క్వారంటైన్లలో 356 మంది ఉన్నారు.

ఇవీ చూడండి:ప్రకృతికి స్వచ్ఛతనందిస్తున్న లాక్​డౌన్​

ABOUT THE AUTHOR

...view details