వచ్చే ఏడాది నుంచి సూర్యాపేట జిల్లాలోని 2 పంటలకు నీరిచ్చేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వెల్లడించారు. చివ్వెల మండలం ఐలాపురంలోని చెరువులో కార్తిక దీపారాధన నిర్వహించారు. గ్రామస్థులతో కలిసి గోదావరికి మంత్రి జలహారతి ఇచ్చారు. ఈ ఏడాది చెరువులకు మాత్రమే అందుతున్న గోదావరి జలాలు... వచ్చే ఏడు నుంచి ప్రతి పొలానికి అందించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ సీజన్లో జిల్లాలోని ప్రతి చెరువును గోదావరి నీటితో నింపుతామన్నారు.
సూర్యాపేట జిల్లాకు నీరు అందించే లక్ష్మీకాలువకు సంబంధించి 7 మోటార్లు విజయవంతంగా నీటిని ఎత్తిపోస్తున్నాయన్నారు. రైతు ముఖాల్లో ఆనందం చూడాలన్నా సీఎం కేసీఆర్ కల నెరవేరబోతోందని మంత్రి పేర్కొన్నారు.
'వచ్చే ఏడాది నుంచి 2 పంటలకు నీరిస్తాం...' - MINISTER JAGADEESH REDDY PARTICIPATED IN JALAHARATHI
సూర్యాపేట జిల్లా చివ్వెల మండలం ఐలాపురంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటించారు. గ్రామస్థులు నిర్వహించిన కార్తిక దీపారధనలో పాల్గొని... గోదావరికి జలహారతి ఇచ్చారు.

MINISTER JAGADEESH REDDY PARTICIPATED IN JALAHARATHI
'వచ్చే ఏడాది నుంచి 2 పంటలకు నీరిస్తాం...'
ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం