సూర్యాపేట జిల్లా హుజుర్నగర్లో నూతనంగా ఏర్పాటైన మార్కెట్ కమిటీ.. ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు, విద్యుత్ చట్టం రైతుల పాలిట శాపంగా మారాయని విమర్శించారు.
రైతులకు శాపంగా వ్యవసాయ బిల్లు: జగదీశ్ రెడ్డి - సూర్యాపేట జిల్లా వార్తలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు, విద్యుత్ చట్టం రైతుల పాలిట శాపంగా మారాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజుర్నగర్లో మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రైతులకు శాపంగా వ్యవసాయ బిల్లు: జగదీశ్ రెడ్డి
వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకొవచ్చని చెప్పి.. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. విద్యుత్ చట్టం వల్ల రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలవలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి... దుబ్బాక వెళ్లి అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి:ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ