అవసరమైతే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోనూ కరోనా బాధితులకు చికిత్స అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బెడ్లు దొరకడం లేదన్న వదంతులను నమ్మొద్దని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.17 కోట్ల వ్యయంతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఈటల ప్రారంభించారు.
అవసరమైతే మెడికల్ కళాశాలల్లోనూ కొవిడ్ చికిత్స: ఈటల - సూర్యాపేట జిల్లా వార్తలు
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా లేవన్న వదంతులు నమ్మొద్దని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని కోరారు.
కరోనాపై మంత్రి ఈటల రాజేందర్, మంత్రి ఈటల రాజేందర్
కొవిడ్ పట్ల ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందని తెలిపారు. కేవలం 5 శాతం మందిలోనే అనారోగ్య సమస్యల కారణంగా అత్యవసర వైద్య సేవలు అవసరమవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 99.5 శాతం రికవరీ రేటు ఉందన్నారు.
ఇదీ చదవండి:కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖుల ఆకాంక్ష
Last Updated : Apr 20, 2021, 4:10 PM IST