'హుజూర్నగర్లో తెరాస గెలుపు ఖాయం' - 'హుజూర్నగర్లో తెరాస గెలుపు ఖాయం' అంటున్న ఎర్రబెల్లి దయాకర్రావు
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి 20 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తం చేశారు.
'హుజూర్నగర్లో తెరాస గెలుపు ఖాయం'
హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి విజయం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని వరంగల్లో తెలిపారు. తెరాసకు ఓటేయాలనే హుజూర్నగర్ ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు తమ వెంటే ఉన్నారని.. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. హుజూర్నగర్లో తెరాస గెలిస్తే కచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి తెలిపారు.