తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టపల్లి వంతెన ప్రారంభం.. ఇక ప్రయాణాలు సులభం

రెండు తెలుగు రాష్ట్రాలని కలిపే వంతెనపై ఇక ప్రయాణాలు మొదలుకానున్నాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వంతెనని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. దీంతో మట్టపల్లి, గుంటూరు జిల్లా తంగెడ ప్రాంతాల మధ్య దూరభారం తగ్గనుంది.

mattapally bridge opened by minister prashanth reddy
మట్టపల్లి వంతెన ప్రారంభం.. ఇక ప్రయాణాలు సులభం

By

Published : Oct 28, 2020, 5:04 PM IST

సూర్యాపేట జిల్లా మట్టపల్లి- గుంటూరు జిల్లా తంగెడ ప్రాంతాలను కలిపే వంతెనని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. దశాబ్దాలుగా పడవలు, బల్లకట్టులపై ఆధారపడి ప్రమాదకర ప్రయాణం సాగించిన ప్రజలకు దీని ద్వారా స్వాంతన లభించనుంది. వంతెన నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో రూ. 50 కోట్లు కేటాయించారు. ఈ హై లెవెల్‌ వంతెనని 840 మీటర్ల పొడవు, 25 మీటర్ల ఎత్తుతో నిర్మించారు.

తగ్గిన దూరభారం

వంతెన నిర్మాణానికి ముందు ఏపీ గుంటూరు జిల్లాలోని దాచేపల్లి చేరుకోవాలంటే ప్రయాణికులు మఠంపల్లి, దామరచర్ల, వాడపల్లి మీదుగా వెళ్లేవారు. వంతెన ప్రారంభం వల్ల ప్రయాణ సమయం తగ్గనుంది.

మట్టపల్లి వంతెన ప్రారంభోత్సవం

ఇదీ చదవండి:రిటైర్మెంట్​కు ఇంకా సమయం ఉంది: గేల్

ABOUT THE AUTHOR

...view details