తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: మట్టపల్లి నారసింహుని ఆలయం మూసివేత - mattapalli lord narasimha swamy temple closed in mattapalli due to corona virus spread

కరోనా ప్రభావం కారణంగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల ప్రవేశం నిలిపివేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు. నిత్యపూజలు మినహా అన్ని సేవలు రద్దు చేశామన్నారు.

mattapalli lord narasimha swamy temple closed in mattapalli due to corona virus spread
కరోనా ఎఫెక్ట్: మట్టపల్లి నారసింహుని ఆలయం మూసివేత

By

Published : Mar 21, 2020, 12:18 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో అతిపురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.

అర్చకులు నిత్య పూజలు నిర్వహిస్తారని... భక్తులకు మాత్రం దర్శనానికి అనుమతి లేదని వెల‌్లడించారు. గుంపులు గుంపులుగా ప్రజలు చేరకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలు మేరకు దేవాలయంలో అన్ని సేవలు రద్దు చేశామన్నారు.

కరోనా ఎఫెక్ట్: మట్టపల్లి నారసింహుని ఆలయం మూసివేత

ఇవీ చదవండి:కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

ABOUT THE AUTHOR

...view details