తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి - Married Woman death in suspicious condition in Suryapeta district

సూర్యాపేట జిల్లా రేపాల గ్రామంలో కల్పన అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమ అల్లుడే చంపేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

By

Published : Oct 13, 2019, 11:48 AM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన సోమపంగు కల్పన అనే వివాహిత పురుగుల మందు తాగి అనుమానాస్పదంగా మృతి చెందింది. మోతే మండల కేంద్రానికి చెందిన కల్పనకు 8 సంవత్సరాల క్రితం రేపాల గ్రామానికి చెందిన పాపయ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాదిగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనటం వల్ల ఏడాదిపాటు ఆమె తల్లి గారి ఇంటి వద్దే ఉంటోంది. ఈ మధ్య కాలంలో బంధువుల సహకారంతో భర్త దగ్గరికి వచ్చింది. వచ్చిన 20 రోజుల్లోనే కూతురు మృతి చెందటం పట్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు తల్లిదండ్రులు. భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని బంధువుల ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ABOUT THE AUTHOR

...view details