సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాళేశ్వరం నుంచి వచ్చిన కొన్ని ఇసుక లారీలను అక్రమంగా ఆపి పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇసుక లారీలతో పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. అన్ని అనుమతులతో ఇసుక రవాణా చేస్తున్నా పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు తగు న్యాయం చేయాలని డీఎస్పీ రఘుని కోరారు. డీఎస్పీ హామీ ఇవ్వడం వల్ల ఆందోళనను విరమించుకున్నారు.
ఇసుక లారీలతో కోదాడ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా - కాళేశ్వరం
ఇసుక లారీలను అక్రమంగా ఆపి పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కోదాడ పీఎస్ ముందు ధర్నా చేపట్టారు. తమకు తగు న్యాయం చేయాలని డీఎస్పీ రఘును కోరారు.
![ఇసుక లారీలతో కోదాడ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా lorry-owners-association-protested-at-kodad-police-station-in-surpet-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7901118-851-7901118-1593938756531.jpg)
ఇసుక లారీలతో కోదాడ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా