తెలంగాణ

telangana

ETV Bharat / state

అందరికీ ఆదర్శం ఆ లారీ డ్రైవర్స్ యూనియన్​ - గ్రామస్థులకు సహాయం చేస్తున్న లారీ డ్రైవర్లు

వారంతా లారీ డ్రైవర్లు...అందరు కలిసి ఒక యూనియన్​గా ఏర్పడ్డారు. యూనియన్​ అనగానే అందరి మనసులో టక్కున్న మెదిలేది...వారి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్నది అనుకుంటే పొరపాటే. కాని  వారంతా నిరుపేదలైనప్పటికీ...వారి మనసు చాలా పెద్దది. ఇదేంటి అనుకుంటున్నారా? అవును...నిజమే....వారి బాగోగులు చూసుకుంటూ... సొంత ఊరిలోని అభాగ్యులకు మేమున్నాం అనే భరోసా కల్పిస్తూ.. అనేక సంక్షేమ కార్యక్రమాలు  చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు సూర్యాపేట జిల్లా మఠంపల్లి  మండలంలోని బక్కమంతుల గూడెం.

లారీ డ్రైవర్స్ యూనియన్​

By

Published : Jul 27, 2019, 8:02 PM IST

అందరికీ ఆదర్శం ఆ లారీ డ్రైవర్స్ యూనియన్​

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెంలో సుమారు 50 మంది వ్యక్తులు డ్రైవింగే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. వీరికి సెంటు భూమి కూడా లేదు. నిరూపేదలైనా వీరంతా... స్థానిక ఎం.సి.ఎల్ కంపెనీలో డ్రైవర్​గా పని చేస్తున్నారు. వీరికి నెలకు సుమారుగా 25 వేల వరకు ఆదాయం వస్తుంది. యూనియన్​గా ఏర్పడి జాయింట్ బ్యాంక్​ అకౌంటు తీసి నెలకు ఒక్కొక్కరు 200 రూపాయలు ఖాతాలో జమ చేస్తారు. బయట వ్యక్తులు కూడా తమకు తోచినంత దీనిలో జమ చేసుకుంటారు. ఇలా సుమారు నెలకు 15 వేల రూపాయల వరకు కూడబెడతారు.

కుటుంబ రక్షణ కోసం...

వీరంతా కలిసి తమ కుటుంబ రక్షణ కోసం ఇన్సూరెన్స్​ పాలసీ కడుతున్నారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగి గాయాలైతే 3 లక్షల 25 రూపాయలు...ఒకవేళ చనిపోతే... బాధిత కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజి వస్తుంది. డ్రైవర్లకు ఏదైనా అనుకోని ఘటన జరిగితే అందరూ వెళ్లి సమస్యను పరిష్కరించుకుంటారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు సైతం 50 వేల రూపాయల వరకు యూనియన్ తరపున వడ్డీ లేకుండారుణం అందిస్తారు. ఇచ్చిన రుణంను నెల వారిగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.
గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ...ఊరిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అలాగే నిరుపేద కుటుంబాల కోసం అన్నదాన కార్యక్రమాలు చేపడుతుంటారు. గ్రామంలోని దేవాలయంలో జరిగే స్వామివారి కల్యాణోత్సవంలో భాగమై అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ అందరిచేత శభాష్​ అనిపించుకుంటున్నారు.

ఇదీ చూడండి : ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి మరో జలపాతం

ABOUT THE AUTHOR

...view details