సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నారు. సోమవారంతో పోల్చుకుంటే ఈరోజు వాహనాల తాకిడి గణనీయంగా తగ్గింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో రాకపోకలు బంద్ - coronavirus update news
లాక్‌డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వాహనాలను రాష్ట్ర పోలీసులు నిలిపివేస్తున్నారు. సూర్యాపేట జిల్లా రామాపురం చెక్పోస్ట్ వద్ద అత్యవసరంగా ప్రయాణించే వారిని మినహా మిగతా వాహనాలను వెనక్కి పంపుతున్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో రాకపోకలు బంద్
అత్యవసర వాహనాలు మినహా మరే వాహనానికి అనుమతి లేదని, తమకు సహకరించాలని డీఎస్పీ రఘు విజ్ఞప్తి చేశారు. అత్యవసరంగా ప్రయాణించే వారిని ఆరోగ్య పరీక్షలు చేసి పంపిస్తున్నారు.
ఇవీ చూడండి: లాక్‌డౌన్ ఒక్కటే సరిపోదు... ఇంకా చాలా చేయాలి