కరోనా సోకిన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరు, నాగారం మండలం వర్ధమానుకోట, నేరేడుచర్ల మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో ఆయా గ్రామాలల్లో ప్రతిరోజు హైడ్రోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రంలో 44 కేసులు నమోదయ్యాయి. ఆయా పాజిటివ్ కేసుల కాంటాక్టులను పూర్తిగా గుర్తించిన అధికారులు ఇప్పటికే వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. జిల్లా కేంద్రంలో లాక్డౌన్ అమలు తీరును కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ పరిశీలించారు.