లాక్డౌన్ అమలు సందర్భంగా మానసిక వికలాంగులకు, వృద్ధులకు, నిరాశ్రయులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసి సేవాగుణాన్ని చాటుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బియ్యం, పప్పులు, ఉప్పులు కూరగాయలను తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న అభాగ్యులకు అందించారు. పట్టణంలోని పోలీసులు నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రాలకు, దురాజుపల్లి గ్రామంలోని వృధాశ్రమానికి, మానసిక వికలాంగుల ఆశ్రమానికి సరుకులను అందించారు.
అభాగ్యులకు ఎస్పీ భాస్కరన్ ఆపన్నహస్తం - నిత్వావసరాల పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని అభాగ్యులకు పోలీసులు అండగా నిలబడ్డారు. పూటగడవక, ఆశ్రయం లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న నిరాశ్రయలకు వికలాంగులకు జిల్లా ఎస్పీ సేవా నేతృత్వంలోని బృందం నిత్యావసరాలను పంపిణీ చేశారు.
అభాగ్యులకు ఎస్పీ భాస్కరన్ ఆపన్నహస్తం