సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వంతెన వద్ద అక్రమంగా తరలిస్తున్న 35వేల విలువైన మద్యాన్ని మఠంపల్లి పోలీసులు పట్టుకున్నట్లు సీఐ రాఘవరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ద్విచక్రవాహనంపై మద్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై ప్రసాద్ సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు.
తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం తరలింపు.. వ్యక్తి అరెస్టు - madyam pattivetha
ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తున్న 35వేల విలువైన మద్యాన్ని మఠంపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. మరో చోట అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
35వేల విలువైన అక్రమ మద్యం పట్టివేత
రఘునాధపాలెంలో అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వీటి విలువ మూడు వేల రూపాయలు ఉంటుందని ఎస్సై వెల్లడించారు.
ఇవీ చూడండి: అ.ని.శా. వలలో చిక్కిన షాబాద్ సీఐ, ఏఎస్‌ఐ