తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రుల్లో తీరనున్న ఆక్సిజన్‌ కొరత... కొవిడ్​ రోగులకు ఉపశమనం - liquid oxygen tanks installation in government hospitals

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ కొరత కష్టాలు తీరనున్నాయి. రాష్ట్రంలో వంద పడకలకు పైన ఉన్న ఆసుపత్రుల్లో లిక్విడ్​ ఆక్సిజన్​ ట్యాంకుల ఏర్పాటు ప్రభుత్వం అనుమతించడం వల్ల అధికారులు వాటిని ఏర్పాటు చేస్తున్నారు. కొవిడ్​ రోగులతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కొంతమేరకు ఉపశమనం కలుగనుంది.

liquid oxygen tanks installation in government hospitals
ఆసుపత్రుల్లో తీరనున్న ఆక్సిజన్‌ కొరత... కొవిడ్​ రోగులకు ఉపశమనం

By

Published : Sep 4, 2020, 8:17 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొవిడ్‌తో పాటు ఇతర వ్యాధులతో బాధపడేవారికి ఆక్సిజన్‌ కొరత లేకుండా కావాల్సిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో వంద పడకలకు పైన ఉన్న ఆసుపత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకుల ఏర్పాట్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడం వల్ల అధికారులు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రుల్లో 13 కేఎల్‌(కిలో లీటర్లు) ట్యాంకులతో పాటు నాగార్జునసాగర్‌ ఏరియా ఆసుపత్రిలో 5కేఎల్‌ ట్యాంకులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. వారం పది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.
జిల్లాలో అన్ని ఆసుపత్రుల్లో చిన్నపాటి సిలిండర్ల ద్వారా హైదరాబాద్‌ నుంచి ఆక్సిజన్‌ దిగుమతి చేసేవారు. ఇది సరిపడక జనరల్‌ ఆసుపత్రుల్లో గుత్తేదారుల నుంచి చిన్నపిల్లల వార్డు, ఎన్‌ఐసీయూ, ఇతర వార్డులకు నెలకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేసి ఆక్సిజన్‌ వినియోగించేవారు. అయినప్పటికీ కొన్నిసార్లు సకాలంలో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ రోగులతో పాటు ఇతర రోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గుత్తేదారులకు చెల్లించే రూ. లక్షల సొత్తులో 25 శాతం మాత్రమే ఖర్చు అవుతుంది. 75 శాతం ప్రభుత్వ ఆదాయం మిగలడంతో పాటు ఆక్సిజన్‌ కొరత అనేది ఉండదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

అన్ని వార్డుల్లో ఆక్సిజన్‌

నల్గొండ, సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రులతో పాటు నాగార్జునసాగర్‌ ఏరియా ఆసుపత్రిలో ఉన్న ప్రతి బెడ్డుకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ అందుబాటుల్లోకి రాబోతుంది. సుమారుగా రోజుకు 1200 మందికి కావాల్సిన ఆక్సిజన్‌ ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉంటుందని అధికారులు అంటున్నారు. ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు ఆక్సిజన్‌ సరఫరా విభాగాన్ని నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది.

పనులు జరుగుతున్నాయి..

త్వరలో ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఆక్సిజన్‌ కొరత అనేది ఉండదు. వార్డుల్లోని ప్రతి బెడ్డుకు ఆక్సిజన్‌ అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికోసం ప్రస్తుత ఐసోలేషన్‌ వార్డు ముందు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకు కోసం నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

-డా.మందుగుల నర్సింహ, జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్, నల్గొండ

ఇవీ చూడండి: పెద్దల సభలో మూడు ఖాళీలు.. గులాబీ నేతల ఆశలు

ABOUT THE AUTHOR

...view details