తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే నేతృత్వంలో తెరాసలోకి పలు పార్టీల నాయకులు - తెరాసలోకి పలు పార్టీల నాయకులు

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో తెరాసలో చేరారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వివిధ పార్టీ నాయకులు తెరాలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

Leaders of various parties in Kodada constituency of Suryapeta district joined Teresa in the presence of MLA Bollam Mallya Yadav
ఎమ్మెల్యే నేతృత్వంలో తెరాసలోకి పలు పార్టీల నాయకులు

By

Published : Jan 31, 2021, 5:47 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం బిక్యతండా గ్రామంలో పలు పార్టీల నుంచి 50మంది కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో తెరాసలో చేరారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వివిధ పార్టీ నాయకులు తెరాలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

కోదాడ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బిక్యతండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవితరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్,సర్పంచ్ అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి

ABOUT THE AUTHOR

...view details