కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లపై దాడులు జరుగుతున్నాయంటూ.. ఓ న్యాయవాది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. నిజామాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు పని చేస్తున్న ఆశా వర్కర్లపై, హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న డాక్టర్లపై అమానుషంగా దాడులకు పాల్పడుతున్నారని కోదాడకు చెందిన న్యాయవాది జలగం సుధీర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
వైద్యులపై దాడులు జరగనివ్వొద్దు : హెచ్ఆర్సీ - వైద్యులపై దాడుల గురించి హెచ్ఆర్సీలో ఫిర్యాదు
రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు కృషి చేస్తున్న వైద్యులపై దాడులు జరుగుతున్నాయంటూ ఓ వ్యక్తి హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. వారికి మనోధైర్యం, రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

'వైద్యులపై దాడులు జరగడం అమానుషం'
వైద్యులకు మనోధైర్యం, రక్షణ కల్పించేలా పోలీస్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ.. హైదరాబాద్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు, సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాల ఎస్పీలకు ఈ తరహా ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి:'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం