సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరింది. కోదాడ బైపాస్ రోడ్ వద్ద నుంచి ఖమ్మం క్రాస్ రోడ్ వరకు ఆర్టీసీ కార్మికులు ర్యాలీలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. హుజూర్నగర్ ఉపఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్తున్న సీతక్క కోదాడలోని ఆర్టీసీ కార్మికుల నిరసనలకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన భవనాల్లో పండుగలు చేసుకుంటే ఆర్టీసీ కార్మికులు రోడ్లపై దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటున్నారని ఎద్దేవా చేశారు.
కోదాడలో ఆర్టీసీ కార్మికులకు సీతక్క మద్దతు - RTC strike supported by seetakka latest news
కోదాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ములుగు ఎమ్మెల్యే సీతక్క మద్దతు తెలిపారు. హుజూర్నగర్ ఉపఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్తున్న సీతక్క దారిలోని కోదాడ వద్ద ఆగి ఆర్టీసీ కార్మికులతో పాటు సమ్మెలో పాల్గొన్నారు.
![కోదాడలో ఆర్టీసీ కార్మికులకు సీతక్క మద్దతు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4732609-193-4732609-1570890732971.jpg)
కోదాడలో ఆర్టీసీ కార్మికులకు సీతక్క మద్దతు
కోదాడలో ఆర్టీసీ కార్మికులకు సీతక్క మద్దతు