సాదాబైనామా భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇదే చివరి అవకాశమని సూర్యాపేట ఆర్డీవో రాజేంద్రకుమార్ తెలిపారు. జిల్లాలోని తుంగతుర్తి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి, రిజిస్ట్రేషన్ విధానాన్ని సిబ్బందికి వివరించారు.
సాదాబైనామాలకు ఇదే చివరి అవకాశం : ఆర్డీవో - సూర్యాపేట జిల్లా సమాచారం
రైతుల ప్రయోజనాల దృష్ట్యా సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం వెసులుబాటును కల్పించిందని సూర్యాపేట ఆర్డీవో రాజేంద్రకుమార్ అన్నారు. ప్రతి రైతు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
సాదాబైనామాలకు ఇదే చివరి అవకాశం : ఆర్డీవో
2014 ముందు భూములకు తప్పనిసరిగా ధరణిలోనే వివరాలు పొందుపరచాలన్నారు. సాదాబైనామాలకు రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ చివరి అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్ప, ఆర్ఐ మహమ్మద్ అలీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.