సూర్యాపేట జిల్లా చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూప్రకంపనలు సంభవించడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చింతలపాలెం మండలంలో అన్ని గ్రామాల్లో భూప్రకంపనలు వచ్చినట్లు తహసీల్దార్ కమలాకర్ వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత నాలుగుసార్లు భూమి కంపించినట్లు వివరించారు. భూకంపలేఖినిపై తీవ్రత 3గా నమోదు అయినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. గతంలో కూడా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ అంశంపై అధికారులకు ఇదివరకే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.
చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూప్రకంపనలు - చింతలపాలెంలో భూప్రకంపనలు
సూర్యాపేట జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు.
చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూప్రకంపనలు