నేరేడుచర్లలో కేవీపీకి ఓటు... ఛైర్మన్ ఎన్నిక వాయిదా - undefined
11:28 January 27
నేరేడుచర్లలో కేవీపీ ఓటేయవచ్చు.. ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్
నేరేడుచర్లలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు ఎక్స్‌అఫీషియో ఓటుహక్కు లభించింది. ఓటు వేసేందుకు కేవీపీకి ఎస్ఈసీ అనుమతి ఇచ్చింది. తెలంగాణ నుంచి ఎంపీగా ఎన్నికైన కేవీపీ.. నేరెడుచర్ల మున్సిపాలిటీలో ఓటు వేసేందుకు దరఖాస్తు చేశారు. అధికారులు దానిని తిరస్కరించగా... రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్కు ఆధారాలతో కేవీపీ లేఖ రాశారు.
దానిపై ఇంకా నిర్ణయం వెలువడనందున.. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి పరిస్థితి వివరించారు. వీరి విజ్ఞప్తిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కేవీపీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. కేవీపీ ఓటు రద్దు చేస్తూ నేరెడుచర్ల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను ఎస్ఈసీ రద్దు చేసింది.
ఈ నిర్ణయంతో నేరేడుచర్లలో సభ్యుల ప్రమాణస్వీకారం మధ్యాహ్నం 3 గంటలకు వాయిదాపడింది. సాయంత్రం 4 గంటలకు ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.