సూర్యాపేట జిల్లా మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సాగర్ నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల పులిచింతల బ్యాక్ వాటర్‌తో గురువారం స్వామివారి గర్భగుడి నీట మునిగింది. 2009లో మాదిరిగానే స్వామివారి కంఠం వరకు నీరు వచ్చిందని ఆలయ అర్చకులు స్పష్టం చేశారు.
వరదనీరు ఇలాగే కొనసాగితే గుడి పూర్తిగా మునిగిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆలయ అధికారులు వెల్లడించారు. నాసి రకం కరకట్ట వల్లే ఇదంతా జరిగిందని స్థానికులు ఆగ్రహించారు. మోటర్లతో నీటిని బయటకు తోడుతున్నా ప్రయోజనం లేదని ఆలయ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇంకా వరదనీటిలోనే మట్టపల్లి నరసింహుడి గర్భగుడి - కృష్ణమ్మ పరవళ్లు
కృష్ణమ్మ వరద ఉద్ధృతితో మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పూర్తిగా నీట మునిగే ప్రమాదం పొంచి ఉంది. పులిచింతల వెనుక జలాలతో రెండురోజులుగా స్వామి వారి గర్భ గుడి నీట మునిగింది.
పరిస్థితి ఇలాగే ఉంటే గుడి పూర్తిగా మునిగే ప్రమాదం : ఆలయాధికారులు
ఇవీ చూడండి : 'నిండుకుండలా నాగార్జున సాగర్'