సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య సిబ్బందికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం పులమాలలతో సన్మానించారు.
కరోనా యోధులను సన్మానించిన ఎమ్మెల్యే - clothes distribution
కరోనాను కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య సిబ్బందిని అందరూ గౌరవించాలని సూచించారు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య సిబ్బందిని సన్మానించారు.
కరోనా యోధులను సన్మానించిన ఎమ్మెల్యే
కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న సిబ్బందిని అందరూ గౌరవించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతీ పౌరుడు బాధ్యతగా సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు. సంక్షోభంలో కూడా సంక్షేమ కార్యక్రమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని కొనియాడారు.