తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది: కోదండరాం - తెలంగాణ జన సమితి వార్తలు

రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారిని విస్మరిస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. నియంత్రిత సాగు పేరుతో రైతుల చేత పంటలు వేయించి చివరికి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో తెజస ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు రాష్ట్రం మొత్తం క్షేత్ర స్థాయిలో నివేదికలు తీసుకొని రైతులకు న్యాయం జరిగే దిశగా పోరాటానికి పార్టీ సిద్దమౌతోందని కోదండరాం తెలిపారు.

kodanda ram meeting with tjs main activists
రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది: కోదండ రాం

By

Published : Nov 22, 2020, 7:47 PM IST

రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, ఆదుకోవలసిన ప్రభుత్వమే వారిని విస్మరిస్తోందని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో తెజస ముఖ్యకార్యక్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియంత్రిత సాగు పేరుతో ప్రభుత్వం.. రైతుల చేత బలవంతంగా సన్న వడ్లు, పత్తి సాగు చేయించి తరువాత తన బాధ్యతను విస్మరించిందని అన్నారు.

అందుకే తెలంగాణ వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొందని మండి పడ్డారు. రైతుల పట్ల కనీస కర్తవ్యం ప్రభుత్వం నిర్వర్తించలేకపోయిందని ఆరోపించారు. పంటవేసిన వెంటనే బీమా పథకం అమలు చేయాలి. కానీ రెండేళ్లుగా బీమా కంపెనీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా మొన్న అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం లభించలేదని అన్నారు.

రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేక పోయిందని కోదండరాం విమర్శించారు. ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుండడంతో, రైతులు బయట మార్కెట్​లో అమ్మకోవాలంటే రూ. 1,300 కంటె ఎక్కువ గిట్టుబాటు కావడంలేదని, పత్తి విషయంలో కూడ ఇలానే ఉందని అభిప్రాయపడ్డారు.

ఎమ్ఎస్పీ ద్వారా కొనుగోలు చేయాలి

ప్రభుత్వం వెంటనే స్పందించి ఎమ్​ఎస్పీ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ప్రతిచోట సీసీఐ కేంద్రాల ఏర్పాటు చేయాలని తెజస అధ్యక్షుడు సూచించారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం జరగకుండా చూడాలని కోరారు. అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:పవన్​ను కిషన్, లక్ష్మణ్ కలిసింది సంజయ్​కి తెలియదా?: రేవంత్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details