సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో నిర్వహించే శివరాత్రి జాతరలో ఎర్ర గుండు, తెల్ల గుండు, నల్లగుండు వంటి ఆటలను పూర్తిగా నిషేధించామని కోదాడ రూరల్ సీఐ శివారాం రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుండ్ల ఆట ఆడించే వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని తెలిపారు. శివరాత్రి జాతరలో లైటింగ్ ప్రభలు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు.
మేళ్లచెరువు శివరాత్రి జాతరలో ఆ ఆటలు నిషేధం: సీఐ - తెలంగాణ వార్తలు
మేళ్లచెరువులో జరిగే శివరాత్రి జాతరలో కొన్ని ఆటలను నిషేధించినట్లు కోదాడ రూరల్ సీఐ శివరాం తెలిపారు. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శివరాత్రి జాతరలో లైటింగ్ ప్రభలు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు.
మేళ్ల చెరువు శివరాత్రి జాతరలో ఆ ఆటలు నిషేధం: సీఐ
జాతరలో అశ్లీల పాటలు, డాన్సులు వేసినా... అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ వేళ ప్రశాంతంగా జాతర జరుపుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:వాహనాలు తగలబడటానికి కారణమేంటి...? ఎలా నివారించాలి..?