తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొవిడ్​ నిబంధనలు పాటించాలి... సాయం చేయడంలో ముందుండాలి' - కొవిడ్ మందుల పంపిణీ

లాక్​డౌన్ సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని... విధిగా మాస్కులు ధరించాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూచించారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కొవిడ్​ మందులను పంపిణీ చేశారు.

kodada mla bollam mallayya distribute covid medicine at suryapet
'కొవిడ్​ నిబంధనలు పాటించాలి... సాయం చేయడంలో ముందుండాలి'

By

Published : May 20, 2021, 2:09 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 'చేతన ఫౌండేషన్ ఖమ్మం' సహకారంతో ఉచితంగా కరోనా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. మాస్కులు,శానిటైజర్​తో పాటు 14 రోజులకు మందులను.. దాదాపు వందమందికి అందించారు.

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, లక్షణాలు కనిపిస్తే నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చేతన ఫౌండేషన్ పాజిటివ్ వచ్చిన వారికి అండగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

'కొవిడ్​ నిబంధనలు పాటించాలి... సాయం చేయడంలో ముందుండాలి'

ఇదీ చూడండి:వైరస్‌ నియంత్రణకు మూడంచెల వ్యూహం ఉండాలి: డా.పీవీ రమేశ్‌

ABOUT THE AUTHOR

...view details