తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలి: ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య - ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు.. వ్యక్తిగత శుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రజలకు సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు.

Kodada Mandal of Suryapet district is a village in Gudibanda village
ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలి: ఎమ్మెల్యే మల్లయ్య

By

Published : Jun 5, 2020, 4:30 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో పల్లెప్రగతి పనులను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలించారు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. అంటు రోగాలు ప్రబలకుండా.. వర్షాకాలంలో నీటినిల్వ లేకుండా జాగ్రత్త వహించాలన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు వ్యక్తిగత శుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. తడి, పొడి చెత్త సేకరణకు గ్రామస్థులకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?

ABOUT THE AUTHOR

...view details