ఆ దారిలో వెళ్తే మీకు ఉపశమనం.. - suryapet
సాధారణంగా వేసవిలో ప్రయాణం అంటే పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఆరోడ్డులో మాత్రం వేసవికాలంలో ఏ సమయంలోనైనా ప్రయాణం హాయిగా చేస్తుంటారు ఆ ప్రాంత ప్రజలు. అదెక్కడో కాదండోయ్ సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి చిలుకూరు వెళ్లే మార్గమే...
కోదాడ చిలుకూరు రహదారి మార్గంలో పచ్చని చెట్లు
సూర్యాపేట జిల్లాలోని కోదాడ నుంచి చిలుకూరుకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదకరమైన మహా వృక్షాలు కనువిందు చేస్తున్నాయి. ప్రయాణికులకు ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. చెట్ల కింద మామిడి, పుచ్చకాయ, కొబ్బరికాయ, సోడాఅమ్ముతున్నారు చిరు వ్యాపారులు. ఈ రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు ఎండ నుంచి కొంచెం ఉపశమనం ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రభుత్వం పట్టించుకొని చివరి కొమ్మలను నరికి ఇంకా గుబురుగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.