తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan reddy on TRS: అవినీతిని ప్రశ్నించేవారిపై కేసులు పెడతారా?: కిషన్ రెడ్డి - సూర్యాపేటలో కిషన్ రెడ్డి

Kishan reddy on TRS: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో లెక్క తేల్చేందుకు ముందుకు రావాలన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఆయన మాట్లాడారు.

Kishan reddy on TRS
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

By

Published : Apr 22, 2022, 7:46 PM IST

Kishan reddy on TRS: రాష్ట్రంలో తెరాస నాయకులు మాఫియాగా మారి ప్రజలను వేధిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పోలీసులు వేధింపులు పరాకాష్టకు చేరాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ అవినీతిపై మాట్లాడితే తెలంగాణ సెంటిమెంట్​ను ముడిపెట్టి ఎత్తుగడలతో ఎదురుదాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. భాజపాపై పథకం ప్రకారం వ్యక్తిగత దూషణలతోపాటు పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ధాన్యం కొనుగోళ్ల పేరుతో తెరాస నాయకులు ధర్నాలు చేస్తే.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తుంటే మాత్రం అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రైతు ఉద్యమంలో మృతి చెందిన పంజాబ్ రైతు కుటుంబాలకు పరిహారమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ కోసం పోరాడి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. భాజపాపై ఎంత బురదజల్లినా.. రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా... వచ్చే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెరాస నియంతృత్వ, నిజాం, అవినీతి పాలనకు వ్యతిరేకంగా భాజపా మరింతగా ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో ప్రజా పాలన భాజపా తీసుకురానుందని కేంద్రమంత్రి తెలిపారు.

ఇవీ చూడండి:Puvva Ajay: సాయి గణేశ్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

బైక్​పై ప్రేమజంట హల్​చల్.. నడిరోడ్డుపై రొమాన్స్ చేస్తూ.

ABOUT THE AUTHOR

...view details