తెలంగాణ

telangana

ETV Bharat / state

'దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలి' - ఖానాపురంలో నిత్యావసర సరకుల పంపిణీ

దాతలు ముందుకు వచ్చి గ్రామంలోని నిరుపేదలను ఆదుకోవాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. సూర్యాపేట జిల్లా ఖానాపురం సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెయ్యి కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

khanapuram sarpunch srinivasarao distribute groceries  for 1000 families
'దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలి'

By

Published : Apr 4, 2020, 5:00 PM IST

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం, వెంకటరామపురంలో వెయ్యి కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఖానాపురం సర్పంచి జొన్నలగడ్డ శ్రీనివాసరావు లక్షా ఇరవై వేల రూపాయలతో... ఒక్కో కుటుంబానికి 5 గుడ్లు, 5 కిలోల కూరగాయలు, మాస్కులు, శానిటేషన్లు అందించారు. ప్రతి గ్రామంలో దాతలు ముందుకొచ్చి నిరుపేదలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు.

'దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details