తెలంగాణ

telangana

ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు: కర్నల్ భార్య సంతోషి

ముఖ్యమంత్రి కేసీఆర్​ కర్నల్ సంతోశ్​ బాబు కుటుంబాన్ని పరామర్శించడం పట్ల... కర్నల్ భార్య హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

By

Published : Jun 22, 2020, 5:15 PM IST

Published : Jun 22, 2020, 5:15 PM IST

karnal wife santoshi says thanks to telanagana government and cm kcr
ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు: కర్నల్ భార్య సంతోషి

సంతోశ్​ బాబుని తీసుకురాలేం కానీ... ఆయన లేని లోటు తీరుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ భరోసా ఇచ్చినట్టు... కర్నల్ భార్య సంతోషి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం బంజారాహిల్స్​లో 711 గజాల ఇంటిస్థలం, రూ. 5కోట్ల చెక్కు అందించినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటానని ఆమె అన్నారు. ఇందుకు సహకరించిన మంత్రి జగదీశ్​ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

గ్రూప్​-1 స్థాయి ఉద్యోగం కూడా... తను కోరిన డిపార్ట్​మెంటులో ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సంతోషి చెపారు. అమరులైన మిగతా జవాన్లకు ప్రకటించిన ఆర్థికసాయం కూడా త్వరలోనే అందించనున్నట్టు కేసీఆర్​ చెప్పినట్టు ఆమె అన్నారు. తన పిల్లలతో ముఖ్యమంత్రి కాసేపు గడపడం తమకు కొండంత ధైర్యం వచ్చిందన్నారు.

ఇదీ చూడండి:కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్నిపరామర్శించిన సీఎం కేసీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details