మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కింద ఏర్పాటు చేస్తున్న రైతు కల్లాలను సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు సమితి సూర్యాపేట జిల్లా సమన్వయకర్త రజాక్ అన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల మండల కేంద్రంలో రైతు కల్లాలకు భూమి పూజ చేసి ప్రారంభించారు.
మద్దిరాల మండలంలో కల్లాల ఏర్పాటుకు భూమిపూజ - రైతుబంధు సమన్వయ సమితి
రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కల్లాలను సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు సమితి సూర్యాపేట జిల్లా సమన్వయకర్త రజాక్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ఆయన రైతు కల్లాలకు భూమి పూజ చేశారు.
మద్దిరాల మండలంలో కల్లాల ఏర్పాటుకు భూమిపూజ
ఒక్కో మండలంలో 168 కల్లాల ఏర్పాటుకు అనుమతి ఉందని, ఎస్సీ, ఎస్టీలకు వందశాతం, బీసీలకు పది శాతం సబ్సిడీతో కల్లాలు ఏర్పాటు చేస్తమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కన్నా సురాంబ, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరామ్ రెడ్డి, ఏడీఏ జగ్గు నాయక్, ఎంపీడీవో సరోజ, ఏపీవో లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్