NTR Fan Suicide Attempt : సూర్యాపేట జిల్లా కోదాడలో థియేటర్లన్నీ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పోస్టర్లతో కళకళళాడుతున్నాయి. ఓ సినిమా హాల్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో ఎన్టీఆర్ అభిమానుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి అడ్డంగా.. మరో ఫ్లెక్సీ పెట్టారని ఆరోపించాడు. ఈ విషయంపై తారక్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన ఫ్లెక్సీకి అలా ఎలా అడ్డుపెడతారని నాగులు అనే అభిమాని గొడవకు దిగాడు.
NTR Fan Suicide Attempt in Kodada : అంతటితో ఆగకుండా తన ఫ్లెక్సీ అడ్డుగా ఉన్న కటౌట్లు తొలగించకపోతే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నాగులును అడ్డుకున్నారు. అతనికి సర్దిజెప్పి ఇంటికి పంపించారు.