మతాలకు అతీతంగా కొలిచే జాన్ పహాడ్ సైదన్న దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామంలో మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
ఘనంగా ప్రారంభమైన జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలు - జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలు
మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకునే జాన్పహాడ్ సైదన్న దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.
![ఘనంగా ప్రారంభమైన జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలు john-pahad-ursu-festivities-that-got-off-to-a-great-start-in-suryapet-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10320652-450-10320652-1611206692256.jpg)
ఘనంగా ప్రారంభమైన జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలు
మొదటి రోజున కొవ్వొత్తులను వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించిన మత పెద్దలు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా వైద్య, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:యాదాద్రి సన్నిధిలో.. హరిహరుల రథశాలలు