తెలంగాణ

telangana

ETV Bharat / state

జాన్​పహాడ్ ఉర్సు​ ఉత్సవాలు ప్రారంభం

మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకునే జాన్​పహాడ్ సైదన్న దర్గా ఉర్సు​ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావిస్తోన్న అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

By

Published : Jan 21, 2021, 8:44 AM IST

john-pahad-ursu-festivities-begin-today-in-suryapet-district
జాన్​పహాడ్ ఉర్సు​ ఉత్సవాలు ప్రారంభం

కుల మతాలకు అతీతంగా కొలిచే జాన్ ​పహాడ్ సైదన్న దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్​ గ్రామంలో జరిగే ఉత్సవాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

జాన్​ పహాడ్ సైదన్న దర్గా ఉర్సు ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వక్ఫ్ బోర్డు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్గా వద్ద భారీ కేడ్లతో ప్రత్యేక క్యూ లైన్లు, తాత్కాలిక మరుగుదొడ్లను అందుబాటులో ఉంచారు. పాలకవీడు మండల కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జాన్ పహాడ్ దర్గా ముస్లింల పవిత్రస్థలమైనప్పటికీ హిందువులు కూడా అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. అందుకే ఈ దర్గాను మతసామరస్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు.

ఇదీ చదవండి:నగరాల భవిష్యత్తు.. ఈమె చెబుతుంది!

ABOUT THE AUTHOR

...view details