తెలంగాణ

telangana

ETV Bharat / state

"సీఎం కేసీఆర్​ రాష్ట్రానికి చేసిందేమి లేదు" - congress

హుజూర్​నగర్​లో కాంగ్రెస్​ను గెలిపించాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్రానికి చేసిందేమి లేదని... కార్మికులను రోడ్డెక్కించి వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.

"సీఎం కేసీఆర్​ రాష్ట్రానికి చేసిందేమి లేదు"

By

Published : Oct 12, 2019, 10:25 PM IST

హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్​పద్మావతిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో బాహుబలి మోటర్లు తప్ప చుక్క నీరు రావడం లేదని ఆరోపించారు. ముస్లింలకు 12 శాతం,ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కారని చెప్పారు. కనీసం రిజర్వేషన్లపై ప్రధానమంత్రికి ఇచ్చిన నివేదికలో ఊసే లేదని, 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను ఒక్క మాటతో రోడ్డెక్కించి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. హుజూర్​నగర్​లో కాంగ్రెస్ గెలుపుతో కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

"సీఎం కేసీఆర్​ రాష్ట్రానికి చేసిందేమి లేదు"

ABOUT THE AUTHOR

...view details