కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి హుజూర్నగర్ నియోజకవర్గంతో విడదీయరాని అనుబంధం ఉంది. జైపాల్‌రెడ్డి మిర్యాలగూడ ఎంపీగా ఉన్న సమయంలో కోదాడ, హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌తో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో, సమ భావన గ్రూపు సభ్యులకు దీపం పథకం అమలు చేశారు. జలయజ్ఞం కార్యక్రమంలో, శాంతినగర్ ఎత్తిపోతల పథకం కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు హాజరయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల భవన సముదాయానికి ఆనాటి గవర్నర్ ఎన్.డి.తివారీతో కలిసి నడిగూడెంలో శంకుస్థాపన చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో జైపాల్‌రెడ్డి అనుబంధం - హుజూర్నగర్ నియోజకవర్గంతో జైపాల్‌రెడ్డి అనుబంధం
దివంగత్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ప్రజలకు చాలా దగ్గరగా ఉంటూ... కష్టసుఖాలను పంచుకునే వారు. మిర్యాలగూడ ఎంపీగా ఉన్న సమయంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గం, ఉత్తమ్‌తో జైపాల్రెడ్డికున్న అనుబంధాన్ని నాయకులు గుర్తుచేసుకుంటున్నారు.
![పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో జైపాల్‌రెడ్డి అనుబంధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3971897-thumbnail-3x2-ooo.jpg)
Jaipal Reddy is an affiliate of Huzoor Nagar constituency
హుజూర్నగర్ నియోజకవర్గంతో జైపాల్‌రెడ్డి అనుబంధం
ఇవీ చూడండి: జైపాల్‌రెడ్డి: ఉస్మానియా టు పార్లమెంట్