తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎంపీ ఉత్తమ్​కు హూజుర్​నగర్ జైలు అధికారుల కృతజ్ఞత' - JAIL OFFICERS THANKFUL TO UTTAM

సూర్యాపేట జిల్లా హూజుర్​నగర్ పట్టణంలోని సబ్​ జైలుకు నూతన అంబులెన్స్ కొనుగోలు నిమిత్తం నల్గొండ ఎంపీ నిధులు మంజూరు చేశారు. మానవతా దృక్పథంతోనే ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు విడుదల చేశానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు.

'నూతన అంబులెన్స్ కొనుగోలుకు నిధుల మంజూరు'
'నూతన అంబులెన్స్ కొనుగోలుకు నిధుల మంజూరు'

By

Published : Feb 15, 2020, 5:46 PM IST

సూర్యాపేట జిల్లా హూజుర్ నగర్ పట్టణంలోని సబ్ జైలుకు ఎంపీ నిధుల నుంచి అంబులెన్స్ మంజూరయ్యింది. ఈ మేరకు పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. స్థానికంగా ఉన్న సబ్ జైలును ఉత్తమ్ సందర్శించినప్పుడు అక్కడి జైలు అధికారులు అంబులెన్స్ కావాలని విజ్ఞప్తి చేశారు. ఫలితంగా 8 లక్షల పది వేల 487 రూపాయల నిధులను నూతన అంబులెన్స్ నిమిత్తం మంజూరు చేశారు.

ఎక్కువగా వృద్ధులే !!

జైలులో చాలా మంది వృద్ధులు వయసు పైబడినవారు ఉన్నారని అధికారులు ఉత్తమ్​కు తెలిపారు. అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స కోసం వారిని హైదరాబాద్ తరలించడానికి తీవ్ర ఇబ్బందులున్నాయని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో నూతన అంబులెన్స్​కు నిధులు విడుదల చేసినందుకు సబ్ జైలు అధికారులు ఎంపీ ఉత్తమ్​కు కృతజ్ఞతలు తెలియజేశారు.

మానవతా దృక్పథంతోనే...

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అంబులెన్సు హైదరాబాద్​ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేదని అధికారులు ఉత్తమ్​కు వివరించారు. మానవతా దృక్పథంతోనే రోగులకు మెరుగైన వైద్య సౌకర్యం నిమిత్తం ఎంపీ నిధులు విడుదల చేశానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు.

'నూతన అంబులెన్స్ కొనుగోలుకు నిధుల మంజూరు'

ఇవీ చూడండి : 'స్థానిక ఎంపీకి ఆహ్వానం లేకుండా ఎలా ప్రారంభిస్తారు'

ABOUT THE AUTHOR

...view details