సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద జబర్దస్త్ నటుడు రాకెట్ రాఘవకు చెక్‌పోస్టు వైద్యాధికారులు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం హోమ్ క్వారంటైన్ ముద్ర వేసి.. క్వారంటైన్ ముగిసే వరకు ఇల్లు దాటి బయటకు రావద్దని సూచించారు.
రాకెట్ రాఘవకు హోం క్వారంటైన్ ముద్ర - సూర్యాపేట జిల్లా వార్తలు
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబర్దస్త్ హాస్యనటుడు రాకెట్ రాఘవకు సూర్యాపేట వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం హోమ్ క్వారంటైన్ ముద్ర వేశారు. క్వారంటైన్ ముగిసే వరకు ఇల్లు దాటి బయటకు రావద్దని వైద్యాధికారులు రాఘవకు సూచించారు.
రాకెట్ రాఘవకు హోం క్వారంటైన్ ముద్ర
ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించి, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని రాఘవ అభిమానులకు సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ ముద్ర వేస్తున్నట్టు చెక్‌పోస్టు వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:మండుతున్న ఎండలు