NGT: కలెక్టరేట్ సమీపంలో చెరువు ఆక్రమణ!.. ఎన్జీటీ ఆశ్చర్యం.. - Suryapeta New Collectorate news
17:53 September 15
సూర్యాపేట కలెక్టర్, పీసీబీకి ఎన్జీటీ చెన్నై బెంచ్ నోటీసులు
సూర్యాపేట కొత్త కలెక్టరేట్ సమీపంలో చెరువు ఆక్రమణలపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. చెరువు ధ్వంసం చేసి వెంచర్లు వేస్తున్నారని టీజేఎస్ నేత ధర్మార్జున్ పిటిషన్ వేశారు. చెరువు ఆక్రమణలపై విచారణ చేపట్టిన ఎన్జీటీ... కలెక్టరేట్ సమీపంలోనే చెరువు ఆక్రమణపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
స్వయంగా తనిఖీ చేయాలని సూర్యాపేట కలెక్టర్‌కు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. సూర్యాపేట కలెక్టర్, పీసీబీకి ఎన్జీటీ చెన్నై బెంచ్ నోటీసులిచ్చింది. చిన్ననీటి పారుదలశాఖ సీఈ, రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకూ నోటీసులు జారీ చేసింది. ఐదుగురు సభ్యుల సంయుక్త కమిటీని నియమిస్తూ ఎన్జీటీ ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 26కు వాయిదా వేసింది.