తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్ధృతంగా కర్త వాగు.. రాకపోకలకు అంతరాయం - పొంగిపొర్లుతున్న కర్త వాగు

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధి పులిచింతల, వజినేపల్లి మధ్య ఉన్న కర్త వాగు ఉద్ధృతంగా పొంగిపొర్లుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాకపోకలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.

ఉద్ధృతంగా కర్త వాగు.. రాకపోకలకు అంతరాయం
ఉద్ధృతంగా కర్త వాగు.. రాకపోకలకు అంతరాయం

By

Published : Sep 14, 2020, 5:10 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధి పులిచింతల, వజినేపల్లి మధ్య ఉన్న కర్త వాగు ఉద్ధృతంగా పొంగిపొర్లుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాకపోకలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉండటం వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

నీట మునిగిన పొలాలు..

పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన వజినేపల్లి గ్రామంలో పంట పొలాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేని వర్షాలతో కుదేలయ్యామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని కలెక్టర్​కు, వ్యవసాయ శాఖ అధికారులకు రైతులు మొరపెట్టుకుంటున్నారు.

ఇవీ చూడండి : భారీ వర్షాలు.. నీట మునిగిన పంటపొలాలు

ABOUT THE AUTHOR

...view details