ప్రజలంతా నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాలు పెంచాలని భారతీయ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. తీవ్ర ఎద్దడి ఉన్న ప్రాంతాలను పరిశీలించే కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని లక్ష్మాపురంలో పెరిక్యూలేషన్ ట్యాంకులను ఆయన పరిశీలించారు. బోరుబావుల తవ్వకాలను తగ్గించి.. చెరువులు, కుంటలు ఏర్పరచుకోవాలని ఆయన తెలిపారు. గుట్టల కింద పెరిక్యూలేషన్ ట్యాంకులు నిర్మించుకోమని రైతులకు సూచించారు.
'భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలి' - lakshmapuram
సూర్యాపేట జిల్లా లక్ష్మాపురంలో పెరిక్యూలేషన్ ట్యాంకులను భారతీయ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్ పరిశీలించారు. నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాలు పెంచాలని సూచించారు.
'భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలి'