కరోనా నివారణలో భాగంగా వారం రోజులుగా లాక్డౌన్ కొనసాగుతున్నందున వలస కూలీలకు బియ్యం, నగదు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని 9 మండలాల్లోని 704 మంది కార్మికులకు తహసీల్దార్ల ఆధ్వర్యంలో 12 కిలోల బియ్యం, రూ. 500 అందించారు.
వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ - తుంగతుర్తిలో వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వలస కార్మికులకు బియ్యం, నగదు అందజేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ
ఎవరూ అధైర్య పడొద్దని, అన్ని విధాల ప్రభుత్వమే ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని సూచించారు. వివిధ కార్యక్రమాల్లో స్థానిక ఎస్సైలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'మీ వల్లే కరోనా ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి'