సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఏపీ16 బీఈ 4096 నెంబర్ గల కారులో లక్షా 47 వేల విలువ గల 337 మద్యం బాటిళ్లను తెలంగాణలో కొనుగోలు చేసి మచిలీపట్నంకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
సరిహద్దులు దాటిస్తున్న లక్షా 47వేల విలువైన మద్యం పట్టివేత
తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు నిందితులను కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లక్షా 47వేల విలువ గల మద్యం, కారు, రెండు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సరిహద్దులు దాటిస్తున్న మద్యం పట్టివేత
తక్కువ ధరకు మద్యం కొని మచిలీపట్నంలో అధిక ధరకు విక్రయించేందుకు మద్యాన్ని తరలిస్తున్నట్లు నిందితులు పోలీసుల విచారణలో పేర్కొన్నారు. ఆ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు కోదాడ రూరల్ ఎస్సై సైదులు గౌడ్ వెల్లడించారు. రెండు చరవాణులు, ఒక కారు ,337 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకునట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి:నిషేధిత గుట్కా ప్కాకెట్లు రవాణా.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు